Page Loader
Rashmika Mandanna: ప్రేమిస్తే మార్పు తప్పదు.. రష్మిక బోల్డ్‌ స్టేట్‌మెంట్‌
ప్రేమిస్తే మార్పు తప్పదు.. రష్మిక బోల్డ్‌ స్టేట్‌మెంట్‌

Rashmika Mandanna: ప్రేమిస్తే మార్పు తప్పదు.. రష్మిక బోల్డ్‌ స్టేట్‌మెంట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుస చిత్రాలతో తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటున్న నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల ఆమె నటించిన 'యానిమల్‌' చిత్రం భారీ విజయాన్ని సాధించగా, అదే స్థాయిలో విమర్శలకూ గురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. యానిమల్‌ సినిమాలో హీరో పాత్రలో కనిపించిన వ్యక్తి స్వభావం ఉన్నవారితో మీరు డేటింగ్‌ చేయగలరా? వారిలో మార్పు తీసుకురాగలరా? అని ఒకరు ప్రశ్నించారు. దీనిపై రష్మిక స్పందించారు. ఎవరినైనా ప్రేమిస్తే, వారితో జీవితం పంచుకుంటే తప్పకుండా మార్పు వస్తుందని నమ్ముతాను. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి ప్రభావం ఉంటుంది. అభిప్రాయాలు పంచుకుంటారు, ఇష్టాయిష్టాలను తెలుసుకుంటారు. మరొకరి కోసం మారిపోతారు.

Details

సినిమాల పరంగా బిజీగా ఉన్న రష్మిక

మీ భాగస్వామితో కొంతకాలం గడిపిన తర్వాత పాత రోజులను తలచుకుంటే, వారు కోసం మీరు ఎంత మారారో తెలుస్తుంది. ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారని తెలిపారు. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి 'థామా' అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. 'ది గర్ల్‌ఫ్రెండ్‌' అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. తాజాగా 'మైసా' అనే మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమాల పాటు ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో కూడా రష్మిక నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యాఖ్యలతోనూ రష్మిక మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు.