
Ilayaraja: ఇళయరాజాకు ఆలయ సంప్రదాయం ప్రకారమే అనుమతి.. క్లారిటీ ఇచ్చిన దేవాదాయశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆండాళ్ ఆలయంలో ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ ఎంపీ ఇళయరాజా గురించి ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆదివారం మార్గళి మాసం ప్రారంభం సందర్భంగా ఆండాళ్ ఆలయంలో దివ్య పాశురం ఆలాపన, నాట్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఆయనకు దేవాదాయశాఖ తరఫున స్వాగతం పలుకగా, ఆలయ ప్రాంతాలైన ఆండాళ్ సన్నిధి, నందవనం, పెరియ పెరుమాళ్ సన్నిధుల్లో దర్శనం చేసుకున్నారు.
అయితే గర్భగుడి ముందున్న అర్థ మండపంలో ఇళయరాజా ప్రవేశించడానికి అడ్డుపడటంపై అనేక వార్తలు ప్రచారం కావడంతో, దీనిపై దేవాదాయశాఖ జాయింట్ కమిషనరు వివరణ ఇచ్చారు.
Details
అర్థ మండపంలోకి పూజారులు, పీఠాధిపతులకే అనుమతి
ఆలయ సంప్రదాయం ప్రకారం అర్థ మండపంలో పూజారులు, పీఠాధిపతులు తప్ప, ఇతరులకు ప్రవేశం లేదని తెలిపారు.
ఇళయరాజా అర్థ మండప ద్వారం ఎక్కినపుడు, వెంట ఉన్న జీయర్ స్వాములు, ఆలయ అర్చకులు బయట నిల్చుని దర్శనం చేయాలని చెప్పిన వెంటనే ఆయన అంగీకరించారని స్పష్టం చేశారు.
ఇళ్లయరాజా ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించారు.
తన ఆత్మగౌరవం వదిలిపెట్టడం తాను ఎప్పుడూ చేయనని ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా తన గౌరవాన్ని కాపాడుకుంటానని ఆయన చెప్పారు.
అభిమానులు అవాస్తవాలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Details
స్పందించిన సినీ నటి కస్తూరి
సినీ నటి కస్తూరి కూడా ఈ ఘటనపై స్పందించారు. చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
ఇళయరాజాను వక్రీకరించి చూపడాన్ని ఖండించారు.
ఇళయరాజా ఒక సంగీత దైవమన్నారు. గర్భగుడిలో కేవలం పూజారులకే అనుమతి ఉంటుందని, ఏ కులం, జాతి వారు అయినా పూజారులు కావచ్చని ఆమె చెప్పారు.