Page Loader
Ileana husband: ఇలియానా భర్త ఇతనే.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ 
Ileana husband: ఇలాయానా భర్త ఇతనే అట.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ

Ileana husband: ఇలియానా భర్త ఇతనే.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హీరోయిన్ ఇలియానా ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన పెళ్లి విషయం చెప్పకుండా.. తన భర్త ఎవరో చెప్పకుండా.. తన బాబు పేరుని ఇటీవల రివీల్ చేసి ఇలియానా అందరరికీ షాకిచ్చింది. ఇటీవల ఇలియానా సోషల్ మీడియా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో మీ బిడ్డకు తండ్రి ఎవరు? మీరు ఒక్కరే ఎలా పెంచుతారు? అనే ప్రశ్నలను ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ అడిగారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెర దించుతూ.. గతంలో తన భర్తతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త పేరు ఏంటి? ఏం చేస్తారనేది ఇలియానా చెప్పకపోవడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భర్తతో ఇలియానా దిగిన ఫొటోలు