తదుపరి వార్తా కథనం

ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్
వ్రాసిన వారు
Sriram Pranateja
Oct 02, 2023
03:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.
తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుని బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే అక్కడ అనుకున్నంత విజయం రాలేదు.
అదలా ఉంచితే, ప్రస్తుతం పండంటి బాబుకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా బయటకు వెల్లడి చేశారు ఇలియానా.
రెండు నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చారు. కోయా ఫీనిక్స్ డోలాన్ అనే పేరును బాబుకు పెట్టుకున్నారు.
బాబు జన్మించి రెండు నెలలు పూర్తయిపోయిందని, అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయని ఇంస్టాగ్రామ్ లో ఇలియానా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు ఇంటర్నెట్లో వైరల్ గా మారుతోంది.