Page Loader
Ileana D'Cruz: ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!
ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!

Ileana D'Cruz: ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ముఖ నటి ఇలియానా మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల తన బేబి బంప్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలో ఆమె తన గర్భిణి స్నేహితురాలితో కలిసి నవ్వుతూ, ఇద్దరూ తమ బేబీ బంప్‌లను ప్రదర్శించుకుంటూ కనిపించారు. ఈ ఫోటోకు ఇలియానా 'బంప్ బడ్డీస్' అనే క్యాప్షన్ జతచేశారు. ఇలియానా తన రెండో గర్భం గురించి ఈ ఏడాది ప్రారంభంలోనే సంకేతాలిచ్చారు. జనవరిలో పరోక్షంగా హింట్ ఇచ్చిన ఆమె, ఫిబ్రవరిలో అర్ధరాత్రి తనకు వచ్చిన ప్రత్యేకమైన ఆకాంక్షలను వెల్లడిస్తూ "మీరు గర్భవతి అని చెప్పకుండానే చెప్పండి" అనే క్యాప్షన్‌తో తన గర్భం గురించి స్పష్టతనిచ్చారు.

Details

గతేడాది మైఖైల్ డోలన్ ను వివాహం చేసుకున్న ఇలియానా

అప్పటి నుండి అభిమానులు ఆమె నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. గతేడాది 2023లో ఇలియానా మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో తన తొలి గర్భాన్ని ప్రకటించారు. ఆగస్టులో కుమారుడు కోవా ఫోనిక్స్ డోలన్ జన్మించాడు. ప్రస్తుతం ఇలియానా తన రెండో బిడ్డ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఈ శుభవార్తతో ఆమెకు అభిమానుల నుండి, సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.