Page Loader
Ileana: మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!
మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!

Ileana: మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి ఇలియానా డిక్రూజ్‌ (Ileana D'Cruz) మరోసారి తల్లిగా మారారు. జూన్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తాజాగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. తన చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ, 'మా ప్రియమైన అబ్బాయి 'కియాను రఫే డోలన్‌'ను మీకు పరిచయం చేస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి'' అనే శీర్షికతో బాబుతో ఉన్న ఫొటోను ఇలియానా షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి ప్రియాంక చోప్రా కూడా ఇలియానాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గతేడాది (2023లో) ఇలియానా మైఖేల్‌ డోలన్‌ను గోప్యంగా పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.

Details

కుటుంబ సభ్యుల్ని ఏమైనా ఉంటే ఊరుకోను

తన కుమారుడికి 'కోవా ఫీనిక్స్ డోలన్‌' అనే పేరు పెట్టినట్లు అప్పట్లో వెల్లడించారు. పెళ్లి, భర్తపై వస్తున్న విమర్శలకు సంబంధించి గతంలో స్పందించిన ఇలియానా, 'నన్నేమన్నా భరిస్తా.. కానీ నా కుటుంబ సభ్యుల్ని ఏమైనా అంటే ఊరుకోనంటూ పోస్ట్‌ చేశారు. ఇలియానా తెలుగు చిత్రసీమలోకి 'దేవదాస్‌' చిత్రంతో పరిచయం అయ్యారు. కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఆమె చివరిసారిగా 2018లో విడుదలైన రవితేజ కథానాయకుడిగా నటించిన 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాలో కనిపించారు. అనంతరం బాలీవుడ్‌ వైపు దృష్టిసారించిన ఈ ముద్దుగుమ్మ, గతేడాది హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.