తదుపరి వార్తా కథనం
Tejas Trailer : అదిరిపోయిన యాక్షన్ థ్రిల్లర్ 'తేజస్' ట్రైలర్.. యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 08, 2023
12:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తేజస్.
మూడేళ్ల నుంచి చిత్రీకరణ దశలో ఉన్న మూవీ ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన్ ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మేకర్ ఇవాళ తేజస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్‌ను చూస్తే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పనిచేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు.