Loading...
Impure Movie: 'కన్య' కాదనే కారణంతో పెళ్లి రద్దు.. ఆలోచింపజేసే కథాంశంతో 'ఇంప్యూర్'
'కన్య' కాదనే కారణంతో పెళ్లి రద్దు.. ఆలోచింపజేసే కథాంశంతో 'ఇంప్యూర్'

Impure Movie: 'కన్య' కాదనే కారణంతో పెళ్లి రద్దు.. ఆలోచింపజేసే కథాంశంతో 'ఇంప్యూర్'

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లి చేసుకోబోయే యువతి 'కన్య' కాదని అత్తమామలకు తెలియడంతో, ఆ సంబంధాన్ని రద్దు చేయడమనే ప్రధానాంశం చుట్టూ నడిచే చిత్రమే' 'ఇంప్యూర్'. టాలీవుడ్‌లో మూసకథలకు భిన్నంగా మహిళలు, పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను బోల్డ్, రియలిస్టిక్‌ కోణంలో ఈ సినిమా చూపించనుంది. కాకినాడలో పుట్టి అమెరికాలో పెరిగిన వారాహి మల్లిపాముల ఈ చిత్రంతో నటిగా,రచయిత్రిగా, నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. న్యూయార్క్‌, లాస్‌ ఏంజిల్స్‌లో టెక్‌ రంగంలో పనిచేస్తూనే రాత్రుళ్లు, వారాంతాల్లో స్క్రిప్ట్‌ రాసుకుని తన కలను సాకారం చేసుకున్నారు. మహిళా ప్రాధాన్య కథతో పలువురు నిర్మాతలను సంప్రదించినా స్పందన రాకపోవడంతో చివరకు స్వయంగా సినిమాను నిర్మించారు.

వివరాలు 

దర్శకురాలిగా నిశాంతి ఇవని

తన తల్లి ఇచ్చిన ఆర్థిక సహాయంతో పాటు అప్పులు చేసి చిత్రాన్ని పూర్తి చేసినట్లు వారాహి తెలిపారు.

సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రను అచ్చమైన తెలుగమ్మాయి యషా ముత్తులూరి పోషించారు.

'మా ఇంటి బంగారం' డైరెక్షన్‌ విభాగంలో పనిచేసిన నిశాంతి ఇవని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్ విజువల్స్ అందించగా.. గ్రామీ అవార్డు నామినీలు రాజా కుమారి, కరణ్ పాండవ్ సంగీతం సమకూర్చారు.

రాజా కుమారి పాడిన 'OMG' పాట, హుక్‌ స్టెప్‌కు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. సాయి కృష్ణ కూడా కీలక పాత్రలో నటించారు.

వివరాలు 

అక్టోబర్‌ 2న విడుదల

లాస్‌ ఏంజిల్స్‌లోని టీసీఎల్‌ చైనీస్‌ థియేటర్‌, న్యూయార్క్‌లోని సినిమా విలేజ్‌లో వరల్డ్‌ ప్రీమియర్స్‌ నిర్వహించగా ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది.

రక్తపాతంతో కూడిన కమర్షియల్‌ కథలకు భిన్నంగా సరికొత్త అంశంతో తెరకెక్కిన 'ఇంప్యూర్' అక్టోబర్‌ 2న పాన్‌ ఇండియా స్థాయిలో పరిమిత థియేటర్లలో విడుదల కానుంది.

ADVERTISEMENT