Trinadha Rao Nakkina: నటి అన్షుపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు తెలిపిన దర్శకుడు
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా, నటి అన్షుపై టాలీవుడ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు తెలిపాడు.
అన్షు, నా మాటల వల్ల బాధపడిన ప్రతి మహిళకూ తాను క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టాలని కాదని, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని పేర్కొన్నారు.
అంతా పెద్ద మనసుతో తనను క్షమించాలని ఆయన ఒక వీడియో ద్వారా వ్యాఖ్యానించారు.
ఈ ఘటన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన తన కొత్త సినిమా 'మజాకా' టీజర్ లాంచ్ ఈవెంట్ సమయంలో జరిగింది.
Details
ఫిబ్రవరి 21న మజాకా రిలీజ్
దర్శకుడు, అన్షు శరీరాకృతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ చిత్రంలో, సందీప్ కిషన్ హీరోగా నటించగా, రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపిస్తారు. రావు రమేశ్, 'మన్మథుడు' ఫేమ్ అన్షు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 'మజాకా' చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.