Loading...
Indian 3: అఫీషియల్: 'భారతీయుడు 3'పై మేకర్స్ కీలక ప్రకటన.. శంకర్ కంబ్యాక్ ఇస్తాడా?

Indian 3: అఫీషియల్: 'భారతీయుడు 3'పై మేకర్స్ కీలక ప్రకటన.. శంకర్ కంబ్యాక్ ఇస్తాడా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన కెరీర్‌లో ఎన్నో భారీ విజయాలు, గుర్తుండిపోయే చిత్రాలు ఉన్నాయి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌తో కలిసి తెరకెక్కించిన 'భారతీయుడు' కూడా అలాంటి సంచలన విజయాల్లో ఒకటి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నటన, శంకర్ టేకింగ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'భారతీయుడు 2'ను ప్రకటించి మళ్ళీ మంచి హైప్ సెట్ చేసుకున్నారు కానీ పార్ట్ 2 భారీ డిజాస్టర్ అయ్యింది. దీంతో 'భారతీయుడు 2'పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి.

వివరాలు 

భారతీయుడు 3' కోసం మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి

ఇదిలా ఉంటే.. 'భారతీయుడు 3' కోసం మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతూనే ఉంది.

అసలు కథలోని కీలక అంశాలను మూడో భాగం కోసం ఉంచి, రెండో భాగాన్ని ముందుగా ఎందుకు విడుదల చేశారనే ప్రశ్నలు కూడా అప్పట్లో వినిపించాయి.

మరోవైపు 'భారతీయుడు 3' థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుందని, అసలు సినిమా విడుదలే ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ 'ఇండియన్ 3'పై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో మూడో భాగం రూపొందుతున్న విషయాన్ని అధికారికంగా మరోసారి ధృవీకరించారు.

దీంతో 'భారతీయుడు 3' విడుదలపై నెలకొన్న అనిశ్చితికి కొంత స్పష్టత వచ్చినట్లైంది.

వివరాలు 

శంకర్ మరోసారి తన మార్క్ చూపిస్తారా? 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తయినట్లు సమాచారం.

ఇంకా కొంత షూటింగ్‌తో పాటు వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో దర్శకుడు శంకర్ కూడా 'భారతీయుడు 3'తో తన కంబ్యాక్‌ను ఎలా చూపిస్తారనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాతో ఆయన మరోసారి తన మార్క్ చూపిస్తారా అనేది చూడాలి.

'భారతీయుడు 3'కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రానున్న ఈ మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'భారతీయుడు 3'పై క్లారిటీ.. కమల్ హాసన్, శంకర్ కాంబోపై బిగ్ అప్డేట్

ADVERTISEMENT