Varanasi : 'వారణాసి' టీజర్‌తో ఇండియన్ సినిమా హవా.. పారిస్‌లో స్పెషల్ స్క్రీనింగ్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి' ఇప్పటికే భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ చర్చలకు దారి తీస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమా, టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియోతోనే ప్రేక్షకుల ఊహలకు రెక్కలు వేసింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీమ్‌తో, ఐమాక్స్ వెర్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీని జక్కన్న ఇప్పటివరకు చూడని విధంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే ఫ్యాన్స్‌కు తెలిసిన విషయం. ఈ పాత్ర కోసం ఆయన భారతీయ ప్రాచీన యుద్ధ కళ 'కలరిపయట్టు'ను ప్రత్యేకంగా నేర్చుకున్నారని సమాచారం.
Details
రూ.1300 కోట్ల బడ్జెట్ తో మూవీ
నెలల తరబడి శిక్షణ తీసుకున్న మహేష్ బాబు ఈ క్యారెక్టర్‌కు పూర్తిగా సిద్ధమయ్యాడు, ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 'వారణాసి'పై అంతర్జాతీయ అంచనాలు పెరగడానికి మరో కారణం ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ ప్రాజెక్ట్‌లో ఆసక్తి చూపించారనే ప్రచారం. ఈ నేపథ్యంలో సినిమా దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Details
టీజర్‌లోని విజువల్స్ అద్భుతం
ఇటీవల విడుదలైన టీజర్‌లోని విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కథా నిర్మాణం త్రేతాయుగం నుంచి కలియుగం వరకు సాగుతూ, వారణాసి, మణికర్ణిక ఘాట్, త్రేతాయుగం నాటి లంకా నగరం, అంబొసెల్లీ వైల్డర్నెస్, వనాంచల్ ఉగ్రభట్టి గుహ, ఆస్టరాయిడ్ శాంభవి, రోస్ ఐస్ షెల్ఫ్ వంటి విభిన్న ప్రదేశాలను ఒకే కథా ప్రవాహంలో మేళవించారు.