Poonam Kaur: త్రివిక్రమ్ ని ఇండస్ట్రీ పెద్దలు ప్రశ్నించాలి.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్టు
ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూను వల్ల మరోసారి మీ టూ ఉద్యమం తెరపైకి వచ్చింది. గతంలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు, అనేక మంది వ్యక్తులపై కంప్లైంట్స్ వచ్చాయి. వాటి విచారణ కోసం టాలీవుడ్ నుండి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జానీ మాస్టర్ పై రెండు వారాలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద న్యాయం కోసం పోరాడుతున్న ఫలితం లేకపోవడంతో సంబంధిత మహిళ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో, పాత కమిటీలపై మరోసారి దృష్టి పడింది. ఈ పరిణామాల నడుమ, నటి పూనమ్ కౌర్ తన ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు.
అసోసియేషన్ పెద్దలు పట్టించుకోలేదు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను చేసిన కంప్లైంట్ అప్పుడే సీరియస్‌గా తీసుకోవాల్సిందని, లేకపోతే తనతో పాటు చాలా మందికి రాజకీయ ఇబ్బందులు ఉండేవి కావు అని చెప్పారు. అసోసియేషన్ పెద్దలు తన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ ని ప్రశ్నించాలని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పోస్ట్ పై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.