Page Loader
అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి 
అల్లు అర్జున్ తో ఇన్ స్టాగ్రామ్ కొలాబరేషన్

అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 30, 2023
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఇన్ స్టాగ్రామ్ కోలాబరేషన్ అయింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. ఉదయం లేవగానే గార్డెన్లో తాను సమయం గడుపుతానని అందమైన గార్డెన్ ని చూపించారు. ఆ తర్వాత వేడి వేడి కాఫీ చాలా ఇష్టమని అల్లు అర్జున్ తెలియజేశారు. ఇంకా అక్కడినుండి పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిలిం సిటీకి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ కార్లో ఫిలిం సిటీకి వెళ్తుంటే అభిమానులందరూ గోల చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.

Details

పుష్పరాజ్ గెటప్ లో అల్లు అర్జున్ 

రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ నుండి డైరెక్ట్ గా పుష్ప 2 సెట్స్ లోకి అల్లు అర్జున్ వెళ్లారు. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ వేసుకునే కాస్ట్యూమ్స్, పుష్పరాజ్ గెటప్, క్యారవాన్ లో సుకుమార్ ని కలవడం, సుకుమార్ తో తనకు 20 ఏళ్లుగా ఉన్న స్నేహం మొదలైన విషయాలన్నీ అల్లు అర్జున్ తెలియజేశారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక సినిమా నటుడితో ఇన్ స్టాగ్రామ్ కోలాబరేట్ కావడం ఇదే మొదటిసారి. అదలా ఉంచితే, ఇటీవల అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు పుష్ప సినిమాలోని నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

అల్లు అర్జున్ ఇన్స్ టాగ్రామ్ పోస్ట్