Pushpa 2 The Rule:మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్‌ను పలకరించనున్న'పుష్ప2: ది రూల్'..సినిమా గురించి ఈ ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా..?
సినీప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప ది రూల్' (Pushpa: The Rule) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్ (Allu Arjun) - సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్‌పై సునామీ సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన 'పుష్ప: ది రైజ్' (Pushpa: The Rise) గొప్ప విజయాన్ని సాధించడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన అన్ని విశేషాలు తెలుసుకునేందుకు సినీప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.
అల్లు అర్జున్ - సుకుమార్ జంట: విజయవంతమైన చరిత్ర
ఇది అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన నాలుగో సినిమా. 2004లో వచ్చిన 'ఆర్య'తో ఈ కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత 'ఆర్య 2', 'పుష్ప: ది రైజ్' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఆల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఈ చిత్రానికి అల్లు అర్జున్ రూ.300 కోట్ల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం, అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ నటులలో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.
ప్రాజెక్ట్ ఆరంభం
2022లో 'పుష్ప 2' పనులు ప్రారంభమయ్యాయి. అల్లు అర్జున్ లుక్ టెస్ట్ పూర్తయిన తర్వాత, సినిమా అధికారికంగా ప్రకటించారు. 2023లో రెగ్యులర్ షూటింగ్ మొదలై, విశాఖపట్నం, బెంగళూరు, ఒడిశా, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. 2024 నవంబర్‌లో షూటింగ్ పూర్తయింది. రెండు భాగాల నిర్ణయం మొదట ఈ సినిమాను ఒకే భాగంగా నిర్మించాలని భావించారు. కానీ సుకుమార్ స్క్రిప్ట్ ప్రకారం షూటింగ్ కొంతమేర పూర్తయిన తర్వాత, నిర్మాత చెర్రీ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ చూసి, దాన్ని రెండు భాగాలుగా విడదీయాలని నిర్ణయించారు. దీంతో 'పుష్ప: ది రైజ్' 2021లో విడుదల కాగా, ఇప్పుడు 'పుష్ప: ది రూల్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హైలైట్ సీక్వెన్స్
ఈ చిత్రంలో గంగమ్మతల్లి జాతర సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సీన్ కోసం బన్నీ (అల్లు అర్జున్) మాతంగి వేషంలో కనిపించనున్నారు. కేవలం ఈ సీక్వెన్స్ కోసమే రూ.60 కోట్ల వ్యయంతో, 30 రోజులపాటు చిత్రీకరణ జరిగింది.
ప్రధాన పాత్రలు
రష్మిక మందన్న: శ్రీవల్లిగా పుష్పరాజ్ భార్య పాత్రలో కనిపించనున్నారు. పార్ట్ 1తో పోలిస్తే ఆమె పాత్రకు ఈ సారి మరింత ప్రాధాన్యత కల్పించారు. ఫహద్ ఫాజిల్: మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను పోషిస్తున్నారు. పార్ట్ 2లో ఆయన పాత్ర మరింత కీలకంగా ఉంటుంది. స్పెషల్ సాంగ్: శ్రీలీల ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేశారు. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు శ్రీలీల రూ.2 కోట్ల పారితోషికం అందుకున్నారు.
మరిన్ని విశేషాలు
పాటల ప్రత్యేకత: మలయాళంలో పల్లవితో 'పీలింగ్స్' పాట అన్ని భాషల్లోనూ వినిపించనుంది. మలయాళ అభిమానులపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. డైలాగ్స్: ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించారు. 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా, ఇంటర్నేషనల్' వంటి డైలాగ్స్ ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. నిడివి: 'పుష్ప 2' నిడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు. ఇది తెలుగు సినిమాల్లో అత్యధిక నిడివి కలిగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. భవిష్యత్ అంచనాలు: అందరి దృష్టి ఇప్పుడు 'పుష్ప: ది రూల్'పై ఉంది. ప్రతీ ఫ్రేమ్‌కి కృషి చేసిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను ఎక్కడికీ తగ్గనివ్వకుండా తీర్చడం ఖాయం అని టాక్.