హ్యాపీ బర్త్ డే సంఘవి.. తెలుగులో ఆఖరి చిత్రం ఏంటో తెలుసా
తెలుగు సినీ పరిశ్రమలో 90 దశకాల్లో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించిన సంఘవి ఇవాళ 46వ పడిలోకి అడుగుపెట్టింది. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం తన అంద చందాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కథనాయకుడిగా వచ్చిన 'తాజ్ మహల్' సినిమాతో ఈ కన్నడ బ్యూటీ సంఘవి తెలుగులో అర్రంగేట్రం చేసింది. దసరా బుల్లోడు,సీతారామరాజు,ఆహ,సూర్య వంశం,మృగరాజు,సమరసింహారెడ్డి,గొప్పింటి అల్లుడు, ప్రేయసి రావే,సందడే సందడి,రవన్న,శివయ్య,తాతా మనవడు, రజినీకాంత్ - బాబా సహా దాదాపు 40 వరకు తెలుగు చిత్రాల్లో నటించినా యమ క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.
46వ పడిలోకి అడుగుపెట్టిన సంఘవి
2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఆంధ్రావాలా' సినిమాలో సంఘవి ఆడిపాడారు. ఆ తర్వాత ఒక్కడే కానీ ఇద్దరు అనే తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమానే సంఘవి కెరియర్ లో ఆఖరి సినిమాగా నిలిచింది. ఓ వైపు అవకాశాలు తగ్గడం, మరో వైపు వయసుకు తగ్గ పాత్రలు రాక 39 ఏళ్లకు 2016లో బిజినెస్ మ్యాన్ వెంకటేశ్ ను పెళ్లాడింది సంఘవి. ఈ జంటకు ప్రస్తుతం ఒక పాప ఉంది. 1977 అక్టోబర్ 4న మైసూరులో జన్మించిన సంఘవి, 42 ఏళ్లు వయసులో బిడ్డకు జన్మనివ్వడంపై అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయినప్పటికీ తమ అభిమాన నటీ తల్లి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.