Thalaivar 170: రజనీకాంత్ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి, పుష్ప విలన్
జైలర్ సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్, ప్రస్తుతం తలైవర్ 170 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి రెండు ఖతర్నాక్ అప్డేట్లు వచ్చాయి. తలైవర్ 170 సినిమాలో రానా దగ్గుబాటి నటించబోతున్నాడని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా తలైవర్ 170సినిమాలో నటించబోతున్నాడని లైకా ప్రొడక్షన్స్ వెల్లడి చేసింది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మంజు వారియర్, రితికా సింగ్ నటిస్తున్నారు.