Rahul Ravindran: 'ఫౌజీ' సెట్స్‌లో ఆసక్తికర ఘటన.. ప్రభాస్ నన్ను గుర్తుపట్టలేదు: రాహుల్ రవీంద్రన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. 'ఇప్పటివరకు మూడు రోజులపాటు 'ఫౌజీ' షూటింగ్‌లో పాల్గొన్నా. అందులో ఒక రోజు ప్రభాస్‌తో కలిసి నటించాను. ఈ సినిమాలో నా పాత్ర కోసం తెల్ల జుట్టు, తెల్ల గడ్డం లుక్‌లో కనిపించాల్సి వచ్చింది. షూటింగ్ రోజున ప్రభాస్‌కు 'హాయ్' చెప్పా, ఆయన కూడా స్మైల్ చేస్తూ హాయ్ అన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ హనును చూసి 'ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ గుర్తుపట్టలేకపోతున్నామని రాహుల్ గుర్తు చేశారు
Details
దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్ర
.'అప్పుడు హను ప్రభాస్‌ను నా దగ్గరికి తీసుకువచ్చి — 'ఇదే నా తొలి సినిమా అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ అని పరిచయం చేశారు. ఆ వెంటనే ప్రభాస్ ఆశ్చర్యపడి 'రాహుల్ మీరా..? మీరు అంత క్యూట్‌గా ఉండేవారు.. ఇప్పుడు ఇలా ఉన్నారేంటి?' అని నవ్వుతూ అన్నారు. వెంటనే 'గుర్తుపట్టలేకపోయానని అనుకోకండి' అని సిగ్గుపడుతూ చెప్పారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇక నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాహుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రూపొందించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) త్వరలో విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.