LOADING...
Sai Dharam Tej : 'ఎంత పని చేశావు రా వరుణ్'.. పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ 
Sai Dharam Tej : 'ఎంత పని చేశావు రా వరుణ్'.. పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్

Sai Dharam Tej : 'ఎంత పని చేశావు రా వరుణ్'.. పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Nov 13, 2023
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీ జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన సోషల్ మీడియాలో ఎంత వైరల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సోమవారం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. వరుణ్ పెళ్లికి సంబంధంచి ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు, ఈ సందర్భంగా రాసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. వరుణ్ పెళ్లి రోజు.. మండపం వద్దకు అతను వెళ్తుండగా, సాయి ధరమ్ తేజ్ అతని కారుపై కాలుపెట్టి ఆపుతున్నట్లు తాజాగా షేర్ చేసిన ఫొటోలు కనిపిస్తుంది. అంతేకాదు, ఎందుకు చేసుకుంటున్నావ్ పెళ్లి అని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది.

సాయి

నీకు పెళ్లి సంబరాలు.. నాకేమో..: ధరమ్ తేజ్ 

అలాగే ఫొటోకు ఆసక్తికర కామెంట్స్‌ను ధరమ్ తేజ్ జోడించాడు. 'ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. నీకు నీ పెళ్లి సంబరాలు, నాకు నా స్వతంత్ర పోరాటం' అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. వాస్తవానికి మెగా కుటుంబంలోని కజిన్స్ అంతా ఎంతో సరదాగా ఉంటారు. రెగ్యులర్‌గా పార్టీలు చేసుకుంటారు. ఈ క్రమంలో సరదాసరదా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లిలో మెగా కజిన్స్ రచ్చ రచ్చ చేసారు. ముఖ్యంగా పెళ్లి కానీ, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ హంగామా చేశారు. ఈ నేపథ్యంలోనే బ్యాచలర్ లైఫ్‌ను కోల్పోతున్న వరుణ్‌ను కాసేపు ఆట పట్టించినట్లు తెలుస్తోంది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

సాయి ధరమ్ తేజ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు