
హను-మాన్ సినిమా ప్రమోషన్స్: పెద్ద ప్లానే వేసిన ప్రశాంత్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
హను-మాన్.. టీజర్ రిలీజ్ అయ్యేంతవరకు ఈ సినిమా రెడీ అవుతోందని చాలామందికి తెలియదు.
ఒకటి రెండు చిత్రాల్లో కనిపించిన తేజ సజ్జా హీరోగా ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుందని ఎవ్వరికీ తెలియదు.
అయితే టీజర్ రిలీజ్ అవ్వగానే ఈ సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. దానికి కారణం టీజర్ లో కనిపించిన విజువల్స్.
హనుమంతుడిని సూపర్ హీరోగా చూపించబోతున్న ఈ సినిమాపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. అప్పటినుండి ఈ సినిమా మేకర్స్ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు.
అందుకే ఈ ఏడాది మే నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు.
ప్రస్తుతం హను-మాన్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
Details
11 భాషల్లో విడుదల కానున్న హను-మాన్
హను-మాన్ చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ తెలియజేశాడు.
వినాయక చవితి నుండి హను-మాన్ చిత్ర ప్రమోషన్లు ప్రారంభమవుతాయని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశాంత్ వర్మ వెల్లడి చేశాడు.
అంటే సినిమా విడుదలకు మూడున్నర నెలల ముందు నుంచే హను-మాన్ ప్రమోషన్ పనులు ప్రారంభమవుతాయన్నమాట.
తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను 11భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.