తదుపరి వార్తా కథనం
Vishwak Sen:అంతర్జాతీయ గుర్తింపు సాధించిన విశ్వక్ సేన్ మూవీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 01, 2025
05:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి 8న విడుదలైంది. చాందిని చౌదరి, అభినయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని ప్రారంభంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని భావించగా, 40 శాతం షూటింగ్ పూర్తయ్యాక, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును టేకప్ చేసి మంచి బడ్జెట్ అందించింది.
ఇటీవల ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
Details
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025 కు ఎంపిక
గామి చిత్రాన్ని 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025' కు అధికారికంగా ఎంపిక చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఈ అరుదైన గుర్తింపు లభించడంతో గామి సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.