Loading...
Anirudh Ravichander Wedding: అనిరుధ్‌-కావ్య మారన్ పెళ్లిపై ఆసక్తికర చర్చ.. ఆ ప్రత్యేక వివాహ పద్ధతి వెనుక కథ ఇదే!
అనిరుధ్‌-కావ్య మారన్ పెళ్లిపై ఆసక్తికర చర్చ.. ఆ ప్రత్యేక వివాహ పద్ధతి వెనుక కథ ఇదే!

Anirudh Ravichander Wedding: అనిరుధ్‌-కావ్య మారన్ పెళ్లిపై ఆసక్తికర చర్చ.. ఆ ప్రత్యేక వివాహ పద్ధతి వెనుక కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రీస్‌లో జరిగిన వీరి పెళ్లికి సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ వివాహం కేవలం స్టార్ అతిథుల హాజరుతోనే కాకుండా.. వారు ఎంచుకున్న పెళ్లి పద్ధతితోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

వివరాలు

సంప్రదాయ ఆచారాలు లేకుండానే పెళ్లి

అనిరుధ్, కావ్య మారన్ తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అలాగే గొలుసులను కూడా మార్చుకున్నారు.

అయితే సాధారణంగా హిందూ వివాహాల్లో కనిపించే విస్తృతమైన సంప్రదాయ ఆచారాలు, వేడుకలు లేకుండానే వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అనిరుధ్.. కావ్య మెడలో గొలుసు కడుతున్న ఫొటో బయటకు రావడంతో ఈ వివాహ వేడుకపై ఆసక్తికర చర్చ మొదలైంది.

సంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో కాకుండా ఇలా ఎందుకు చేసుకున్నారనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వచ్చాయి.

వివరాలు

స్వాభిమాన్ వివాహం చేసుకున్నారా?

ఈ ప్రశ్నలకు డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి డాక్టర్ టీఆర్‌బీ రాజా స్పందించారు. ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వేదికగా ఓ కామెంట్‌కు బదులిస్తూ.. అనిరుధ్, కావ్య మారన్ 'స్వాభిమాన్ వివాహం' (Self-Respect Marriage) చేసుకున్నారని వెల్లడించారు.

తమిళనాడులో జరిగిన సామాజిక సంస్కరణ ఉద్యమం నుంచి ఈ వివాహ విధానం పుట్టుకొచ్చింది.

సంప్రదాయ మతపరమైన ఆచారాలకు బదులుగా వధూవరుల సమ్మతి, సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చే పద్ధతిగా స్వాభిమాన్ వివాహానికి గుర్తింపు ఉంది.

దీంతో అనిరుధ్, కావ్య మారన్ ఎంచుకున్న ఈ ప్రత్యేక వివాహ విధానం ఇప్పుడు చర్చకు దారితీసింది.

ADVERTISEMENT