Page Loader
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సినిమా రీమేకా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ
'భగవంత్ కేసరి' సినిమా రీమేకా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సినిమా రీమేకా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2023
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

డైరక్టర్ అనిల్ రవిపూడి, యువరత్న నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో భగవంత్ కేసరి అనే సినిమా వస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్ని రోజులగా ఈ సినిమాపై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. 2004లో విడుదలైన నందమూరి హరికృష్ణ చిత్రం 'స్వామి'కి 'భగవంత్ కేసరి' రిమేక్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.తాజాగా దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, అలానే అక్టోబర్ 19న థియేటర్లలో 'నెవర్ బిఫోర్ NBK'ను చూస్తారంటూ అంచనాలను పెంచేశారు.

Details

అక్టోబర్ 19న భగవత్ కేసరి రిలీజ్

భగవత్ కేసరి సినిమాను అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనపించనున్నారు. ఈ మధ్యనే అర్జున్ రాంపాల్ తన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక స్వరాలను తమన్ అందిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'భగవంత్ కేసరి' సినిమాపై నిర్మాణ సంస్థ ట్వీట్