Dimple Hayathi: డింపుల్ హయాతికి పెళ్లయిందా? నెటిజన్ కామెంట్‌కు హీరోయిన్ ఫన్నీ కౌంటర్!
ఈ వార్తాకథనం ఏంటి
అసలు విషయం తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో కొందరు రకరకాల ఊహాగానాలు చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి విషయంలోనూ ఇదే జరిగింది. ఆమెకు పెళ్లయిపోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. డింపుల్ తనదైన శైలిలో ఫన్నీగా స్పందించి అందరినీ నవ్వించింది. శర్వానంద్ నటించిన యాక్షన్ మూవీ 'భోగి' ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డింపుల్ హయాతి హాజరైంది. తన గ్లామర్, ఎనర్జీతో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్టేజ్‌పై శర్వానంద్ పక్కన నిల్చున్న డింపుల్.. ఆయన వైపు కొద్దిగా వంగి సరదాగా ఏదో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాలు
పెళ్లయిందంటూ నెటిజన్ కామెంట్
ఓ మీమ్ పేజీ ఈ వీడియోను సరదాగా షేర్ చేయడంతో దాని కింద కామెంట్లు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. "శర్వానంద్ లాగే డింపుల్ హయాతికి కూడా పెళ్లయిపోయింది కదా" అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై డింపుల్ ఏమాత్రం సీరియస్ అవ్వకుండా చాలా కూల్‌గా స్పందించింది.
తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
వివరాలు
గాసిప్స్‌కు డింపుల్ చెక్
నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సహనటులుగా శర్వానంద్, డింపుల్ హయాతి సరదాగా మాట్లాడుకున్నారు.
కానీ ఆ చిన్న వీడియోకు కొందరు రకరకాల లింకులు పెట్టి ఏకంగా పెళ్లి వార్తల వరకు తీసుకెళ్లారు. అయితే డింపుల్ ఇచ్చిన ఒక్క స్వీట్ పంచ్‌తో ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.
మొత్తానికి ఈ వీడియో, దానిపై ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లైతో 'భోగి' సినిమాకు సోషల్ మీడియాలో మంచి ఉచిత ప్రచారం లభించినట్టయింది.
మరి నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.