Manchu Manoj: మంచు మనోజ్ 'అహం బ్రహ్మసి' అగిపోయిందా..? క్లారిటీ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మసి'తో వస్తున్నట్లు ప్రకటించాడు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఆ తర్వాత మొదటి భార్యతో విడాకులు, భూమా మౌనికారెడ్డితో రెండో పెళ్లి వంటి కారణంగా ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
ఇప్పటివరకూ ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా నిలిచిపోయిందని పుకార్లు జోరు అందుకున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి అప్డేట్ ఇచ్చారు.
వ్యక్తిగత కారణాలతో మనోజ్ ఈ సినిమాకు కొంచెం గ్యాప్ ఇచ్చాడని, దీంతో తాను మరో సినిమా చేయాల్సి వచ్చిందని దర్శకుడు పేర్కొన్నాడు.
Details
త్వరలోనే ఆహం బ్రహ్మసి షూటింగ్
పరస్పర అంగీకారంతో ఈ సినిమాకు కొన్నాళ్లు పక్కన పెట్టామని, ఆ ప్రాజెక్టు నిలిచిపోలేదని, తప్పకుండా మంచు మనోజ్‌తో సినిమా చేస్తానని శ్రీకాంత్ ఎన్.రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ చేస్తున్న ఆదికేశవ సినిమాకు సంబంధించిన పనులన్ని అయిన తర్వాత ఆహం బ్రహ్మసి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
ఆదికేశవ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆహం బ్రహ్మసి గురించి దర్శకుడు శ్రీకాంత్ తెలిపాడు.