Page Loader
HIT-4: హిట్ సినిమా సీక్వెల్‌లో బాలకృష్ణ..!
హిట్ సినిమా సీక్వెల్‌లో బాలకృష్ణ..!

HIT-4: హిట్ సినిమా సీక్వెల్‌లో బాలకృష్ణ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే అనేక సినిమాలకు సీక్వెల్‌లు రూపొందుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు కూడా సీక్వెల్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కేజీఎఫ్, పుష్ప 2 వంటి చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. ఇక, లోకల్‌గా కూడా చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. వాటిలో హిట్ సినిమా ఒకటి. శైలేష్ దర్శకత్వంలో రూపొందిన హిట్ సినిమా 2020లో విడుదలై, మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

వివరాలు 

హిట్ 3 సినిమాలో నాని

ఈ సినిమాకు సీక్వెల్‌గా హిట్ 2 విడుదలైంది, ఇందులో అడవి శేష్ హీరోగా నటించాడు.హిట్ 2 కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలను నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం, హిట్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్లు విడుదలై, ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. హిట్ 3 కూడా మంచి విజయాన్ని సాధించనుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హిట్ 4 సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హిట్ 4లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

వివరాలు 

అఖండ 2 సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ

బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో భారీ విజయం సాధించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడు హిట్ 4లో బాలకృష్ణ నటిస్తారని సమాచారం. ప్రస్తుతం, బాలకృష్ణ అఖండ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత, హిట్ 4లో బాలకృష్ణ నటించారా లేదా అన్న విషయంపై క్లారిటీ తెలియనుంది.