Page Loader
Kingdom : ఆలస్యానికి రీ రికార్డింగే కారణమా? కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ వాయిదా!
ఆలస్యానికి రీ రికార్డింగే కారణమా? కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ వాయిదా!

Kingdom : ఆలస్యానికి రీ రికార్డింగే కారణమా? కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ వాయిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్ డమ్' సినిమాకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మే 30నుండి జులై 4కు వాయిదా పడిన ఈ సినిమా, ఇప్పుడు ఆ తేదీకూ రాకపోగా, మళ్లీ అనిశ్చితిలోకి వెళ్లింది. జులై 4 నుంచి కూడా రిలీజ్ పోస్ట్‌పోన్ కావడానికి ముఖ్య కారణం ఒక వ్యక్తే అని తెలుస్తోంది. అతనిని విజయ్ దేవరకొండ స్వయంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం జరుగుతోంది. 'కింగ్ డమ్' రీ రికార్డింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం.

Details

'కూలీ' పనులకే ప్రాధాన్యం

రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాకు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్శన్ చేస్తున్నాడు. రెండు సినిమాల రీ రికార్డింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి 'కూలీ' పనులకే ప్రాధాన్యం ఇస్తున్నాడని వినికిడి. 'కూలీ' మూవీ రీ రికార్డింగ్ పూర్తయిన తర్వాతే 'కింగ్ డమ్' పనులను ప్రారంభిస్తానని అనిరుధ్ చెప్పినట్టు టాక్‌. దీంతో 'కింగ్ డమ్' టీమ్ ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందుల్లో ఉంది. రీ రికార్డింగ్‌తో పాటు, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలే ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ పూర్తి అయిన తర్వాతే మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం.