NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్‌స్టోన్ మూవీ?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో సక్సెస్ ఉన్న దర్శకులకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి పరిస్థితి కూడా అదే. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి బాక్సాఫీస్ విజయాలతో పాటు ఇటీవల 'విశ్వనాథ్ & సన్స్' చిత్రంతోనూ సక్సెస్ ట్రాక్‌లో ఉన్న ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాను అక్కినేని హీరో నాగ చైతన్యతో చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో మైలురాయి అయిన 25వ చిత్రం కోసం దర్శకుడిని ఖరారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం
ఈ క్రమంలో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరితో కలిసి తన మైల్స్‌టోన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని సినిమాల్లో ఇతర భాషలకు చెందిన హీరోలతో పనిచేసిన వెంకీ అట్లూరి.. ఈసారి ఓ ప్రాపర్ తెలుగు హీరోతో కలిసి వైవిధ్యమైన కథను తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో తాను రాసుకున్న పలు కథలను మొదట నాగ చైతన్యకే వినిపించానని వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
వివరాలు
ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా చర్చ
ఇటీవల అక్కినేని అఖిల్‌కు 'లెనిన్'తో సూపర్‌హిట్ అందించిన నాగవంశీ.. ఇప్పుడు నాగ చైతన్య మైల్స్‌టోన్ 25వ చిత్రాన్ని టేకప్ చేసి, వెంకీ అట్లూరితో మరో విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి-నాగ చైతన్య కాంబినేషన్ గురించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.