Isha ambani: ఆస్కార్ 2026 వేడుకలో ఈషా అంబానీ సందడి
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్ 2026' వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె వింటేజ్ వాలెంటినో గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా అంబానీ తన భర్త ఆనంద్ పిరమాల్‌తో కలిసి ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ ఇటలీ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో రూపొందించిన ఫాల్/వింటర్ 2006-2007 కలెక్షన్‌కు చెందిన గౌన్‌ను ఆమె ధరించారు. చోకర్ స్టైల్‌లో ఉన్న డైమండ్ నెక్లెస్ అందర్నీ ఆకర్షించింది.
వివరాలు
భవిష్యత్తులో మరిన్ని ఈవెంట్స్
ఈ కార్యక్రమానికి ముందు ఈషా అంబానీ అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆ మ్యూజియంవారు, నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ కలిసి భవిష్యత్తులో నిర్వహించగల కార్యక్రమాలపై చర్చించారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం, అలాగే భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ఆమె ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఈషా అంబానీ పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన మెట్ గాలా కార్యక్రమంలో కూడా ఆమె హాజరై అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.