
Mahesh Babu: రాజమౌళి బోన్‌లో మహేష్ చిక్కలేదా..? మళ్లీ ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ టైమ్‌కి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు.
ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు కుటుంబంతో వెకేషన్‌కి వెళ్లడం ఆయనకి నిత్య సాధారణమే.
రాజమౌళితో సినిమా సైన్ చేసినప్పటి నుంచే మహేష్ ఇక మూడు సంవత్సరాలు పూర్తిగా బిజీ అయిపోతాడని భావించారు.
అంతే కాదు, రాజమౌళి ఒక వీడియోలో మహేష్ పాస్‌పోర్ట్ సీజ్ చేశామంటూ సరదాగా పేర్కొనడంతో, పాపం మహేష్ ఇక టూర్స్‌కి లైసెన్సే లేదేమోనని అభిమానులు గుబురుపడ్డారు.
అయితే నిజంగా మహేష్ బాబు రాజమౌళి బోన్‌లో చిక్కుకున్నట్టేం కాదు. గతంలో లాగే పిల్లల వేసవి సెలవుల సమయంలో కుటుంబంతో కలిసి విదేశీ టూర్లు చేస్తూ వస్తున్నారు.
Details
విదేశీ వెకేషన్ కి ప్లాన్ చేసినట్లు సమాచారం
ఇటీవలే ఇటలీ టూర్‌కి వెళ్లిన మహేష్ బాబు, తాజాగా మరోసారి విదేశీ వెకేషన్‌కి ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో కలిసి మహేష్ బాబు ఓ పాటలో నర్తిస్తున్నారని సమాచారం. ఆ పాట షూట్ పూర్తైన వెంటనే సమ్మర్ హాలిడేస్‌కి బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది.
ఇంతలో మహేష్-నమ్రతల కుమార్తె సితార ఘట్టమనేనికి వేసవి సెలవులు ఇచ్చినట్టు సమాచారం.
కుమారుడు గౌతమ్ ఇప్పటికే విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్, నమ్రత, సితార కలిసి గౌతమ్ దగ్గరకు వెళ్లనున్నారు.
Details
దుర్గా ఆర్ట్స్" పతాకం మూవీ నిర్మాణం
నెల రోజుల పాటు మహేష్ బాబు ఇండియాలో ఉండకపోవచ్చని, ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరించనున్నారని టాక్.
రాజమౌళితో సినిమా చేస్తున్న సమయంలో కూడా ఇంత సమయం దొరకడం చిన్న విషయం కాదు.
దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, "మహేష్ బాబు పాస్‌పోర్ట్ సీజ్ అన్నది ఫేక్! టూర్లకి ఆయనకెప్పుడూ గ్రీన్ సిగ్నల్!" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని కే ఎల్ నారాయణ "దుర్గా ఆర్ట్స్" పతాకంపై నిర్మిస్తున్నారు.