Loading...
Aishwarya Lekshmi: డబ్బులు పోయినా పర్లేదు.. ఇన్‌స్టాకు ఎందుకు దూరమయ్యారో చెప్పిన ఐశ్వర్య లక్ష్మి
డబ్బులు పోయినా పర్లేదు.. ఇన్‌స్టాకు ఎందుకు దూరమయ్యారో చెప్పిన ఐశ్వర్య లక్ష్మి

Aishwarya Lekshmi: డబ్బులు పోయినా పర్లేదు.. ఇన్‌స్టాకు ఎందుకు దూరమయ్యారో చెప్పిన ఐశ్వర్య లక్ష్మి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)ఏడాది నుంచి సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాను పూర్తిగా వదిలేస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆమె తెలిపారు. అయితే మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నేను ఏదో ఒక కారణంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. కొన్నిరోజులు సోషల్‌ మీడియాను నిలిపివేసి, ఆ తర్వాత తిరిగి రావాలని భావించా. కానీ, విపరీతంగా పెరిగిపోయిన ఏఐ ఆధారిత కంటెంట్‌.. దాన్ని ఉపయోగించి చేస్తోన్న అసభ్యకరమైన ఎడిటింగ్‌ సంస్కృతిని చూసి విసిగిపోయానని ఐశ్వర్య లక్ష్మి చెప్పారు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఒక వ్యక్తిగా తనకు ఎంతో స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.

వివరాలు

కామెంట్లు, మెసేజ్‌లతో నెగెటివిటీ

''దయచేసి మీరు మళ్లీ అకౌంట్‌ క్రియేట్ చేసుకోండి.. లేదంటే చాలా డబ్బు నష్టపోతారని తన మేనేజర్లు చెప్పారని ఐశ్వర్య లక్ష్మి వెల్లడించారు.

అయితే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం వల్ల లభించే మానసిక ప్రశాంతత తనకు అన్నింటికంటే విలువైనదని వారికి చెప్పినట్లు పేర్కొన్నారు.

గతంలో సోషల్‌ మీడియాలో కామెంట్లు, మెసేజ్‌లు చదివేదాన్నని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. వాటిని చదివిన తర్వాత ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా ఉందనే భావన కలిగేదని చెప్పారు.

''నన్ను ఎవరూ ఇష్టపడరనే భావన మొదలైంది. కామెంట్స్‌ మనకు తెలియకుండానే నెగెటివిటీని సృష్టిస్తాయి'' అని ఆమె పేర్కొన్నారు.

వివరాలు

బ్రాండ్‌ ప్రచారాలపై ఐశ్వర్య లక్ష్మి

ఇక బ్రాండ్‌ ప్రచారాల గురించి కూడా ఐశ్వర్య లక్ష్మి స్పందించారు. తాను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయలేనని స్పష్టం చేశారు.

నెట్టింట ప్రచారం చేయకుండా ఉన్నప్పటికీ.. ప్రజలు తనను సినిమాల ద్వారానే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

ADVERTISEMENT