వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు
నూతన సంవత్సరం సమీస్తున్న వేళ ప్రపంచమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం భారత్‌కు ఆర్థిక మాంధ్య భయాలు ఇప్పటికి తొలిగిపోలేదు. ప్రస్తుతం విమానాయాన సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు, రిటైల్ దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ పరిణామాలను ఆర్థిక వేత్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ గతంలో భారీ స్థాయిలో ఉద్యోగాలను తొలగించారు. గత రెండేళ్లలో కలలు కన్న SaaS సంస్థలు నష్టపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే 2023లో డిమాండ్ పెరిగే ఏడాదని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే, వచ్చే ఏడాది కంపెనీలన్నీ భారీ స్థాయిలో నియామకాలను చేపట్టనున్నాయి. సహజంగానే చాలా టెక్ కంపెనీలు 2022 కంటే తక్కువ రాబడి వృద్ధిని చూపడంతో 2023లో ఆదాయాలు ప్రభావితమవుతాయి.
ఎగుమతులపై ప్రభావం
Dow, S&P, Nasdaq, Euronext, FTSE, DAX ఇతర ప్రధాన ప్రపంచ సూచీలు ఆదాయాలు తగ్గుముఖం పడతాయని ఊహించి ఇప్పటికే బాగా సరిదిద్దుకున్నాయి. అటువంటి ప్రపంచ ఆందోళనలు ఉన్నప్పటికీ భారతదేశం బాగానే ఉంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇతర దేశాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటి ఎగుమతులు వచ్చే ఏడాది ఎదురుగాలిని ఎదుర్కోవచ్చు. భారతీయ ఐటీ పరిశ్రమకు US నుండి సంగం ఆదాయం, మరో 20-30 శాతం ఐరోపా నుండి రానుంది. దేశీయ ఐటి సేవా సంస్థలు రెండేళ్ల అధిక వృద్ధి తర్వాత 2023లో ఆ ఊపును కొనసాగించలేకపోవచ్చని చెప్పొచ్చు. ఎక్కువ పనిని అవుట్ సోర్స్ చేయడం వల్ల ఐటీ పరిశ్రమకు అనుకూలంగా పని చేయనుంది