LOADING...
Year Ender 2024: తెలుగు బాక్సాఫీస్‌పై విజయం సాధించిన పల్లెటూరు కథా చిత్రాలివే!
తెలుగు బాక్సాఫీస్‌పై విజయం సాధించిన పల్లెటూరు కథా చిత్రాలివే!

Year Ender 2024: తెలుగు బాక్సాఫీస్‌పై విజయం సాధించిన పల్లెటూరు కథా చిత్రాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025లోకి అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాదిలో సాధించిన సక్సెస్ రేటు కూడా ఎప్పటిలాగే 10 శాతమే. కానీ ఈ 10 శాతంలో ఎక్కువ శాతం గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలదే. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఈ ఏడాది బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన అరడజను సినిమాలు గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కాయి. గత కొన్నేళ్లుగా మల్టీప్లెక్స్‌ల చుట్టూ తిరిగే కథలు, పబ్ కల్చర్‌ను ప్రధానంగా చూపించే సినిమాలు ఎక్కువగా ఉండగా, ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమాలు పల్లెటూరి వాతావరణాన్ని విశేషంగా ఆవిష్కరించాయి. సిటీ హడావుడి కథలతో విసిగిపోయిన ప్రేక్షకులు పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలకు ఫిదా అయ్యారు.

Details

కలెక్షన్ల వర్షం కురిపించిన హనుమాన్

ఇరుకైన మట్టి రోడ్లు, పచ్చని పొలాలు, చెట్లు, కొండల చుట్టూ తిరిగే కథలు కొత్త అనుభూతిని కలిగించాయి. ఈ ట్రెండ్‌కు హనుమాన్‌ సినిమా ద్వారా శ్రీకారం చుట్టారు. అనంతరం కిరణ్ అబ్బవరం నటించిన 'క' వంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలు విజయాలను నమోదు చేశాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజు హీరోగా రూపొందిన విజువల్ వండర్ హనుమాన్‌ రూ. 30 కోట్ల బిజినెస్ చేస్తే, రూ. 148 కోట్ల షేర్ రాబట్టింది. అదే విధంగా ఆయ్ వంటి చిన్న చిత్రాలు కూడా గ్రామీణ నేపథ్యంలో మంచి వసూళ్లు సాధించాయి. మూడు కోట్లు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఎనిమిదన్నర కోట్లు తీసుకొచ్చింది.

Details

పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేసిన కమిటీ కుర్రాళ్లు

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నవ్వులు పంచిన 'ఓం భీమ్ బుష్' కూడా గ్రామీణ నేపథ్యంలో సక్సెస్‌ అందుకుంది. కిరణ్ అబ్బవరం నటించిన 'క' సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుని మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కొత్త దర్శకుడు తెరకెక్కించిన 'కమిటీ కుర్రాళ్లు' పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేస్తూ విజయాన్ని సాధించింది. పెద్ద హీరోలు కూడా ఈ ఏడాది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో విజయం సాధించారు. నాగార్జున నటించిన 'నా సామిరంగా' సంక్రాంతి రేసులో హిట్‌గా నిలిచింది. గతంలో ప్రెసిడెంటుగారి పెళ్లాం, సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో విజయాలను సాధించిన నాగార్జునకు ఈ సారి కూడా అదే ఫార్ములా కలిసొచ్చింది.

Details

అద్భుత విజయం సాధించిన దేవర

కొరటాల శివ రూపొందించిన 'దేవర' పల్లెటూరి వాతావరణంతో పాటు సముద్ర తీరాలను విఎఫ్‌ఎక్స్ ద్వారా విశిష్టంగా చూపించి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. టాక్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఏడాది తెలుగు సినిమా పల్లెటూరి వైభవాన్ని చాటి చెప్పినదే కాకుండా, చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా సక్సెస్‌ను అందించింది.