Page Loader
Kuberaa: నేటి తరాన్ని మెప్పించడం సవాలే.. 'కుబేర' విజయంపై శేఖర్ కమ్ముల స్పందన
నేటి తరాన్ని మెప్పించడం సవాలే.. 'కుబేర' విజయంపై శేఖర్ కమ్ముల స్పందన

Kuberaa: నేటి తరాన్ని మెప్పించడం సవాలే.. 'కుబేర' విజయంపై శేఖర్ కమ్ముల స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విడుదలైన 'కుబేర' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల తన అనుభవాన్ని పంచుకున్నారు. నేటి తరానికి తగినట్లు కథ రాయడం నిజంగా పెద్ద సవాలని ఆయన అన్నారు. ఇప్పుడున్న తరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో 20 ఏళ్లవారికి తెలిసే విషయాలు ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకే సోషల్‌ మీడియా ద్వారా తెలిసిపోతున్నాయి. అలాంటి తరానికి ఓ కథ చెప్పాలంటే, అదే నిజమైన పరీక్ష. 'కుబేర' విషయంలో ఆ టెస్ట్‌ను దాటాను అనిపించింది.

Details

నిడివి ఎక్కువని భావిస్తున్నారు

అది నాకు పెద్ద విజయమన్నారు. అలాగే ఈ సినిమా లవ్‌స్టోరీ కాదు. మ్యూజికల్‌గానూ కాదు. లవ్‌ సాంగ్స్‌ కూడా లేవు. ఓవైపు స్టార్‌, మరోవైపు బిచ్చగాడు.. ఇలాంటి భిన్నమైన పాత్రలతో కథను ఆసక్తికరంగా నడిపించాం. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథను రాసుకునే క్రమంలో ఎన్నో పరీక్షలు పాస్‌ అవ్వాల్సి వచ్చిందన్నారు. కథను కట్ చేయాలనుకున్నప్పటికీ, ట్రిమ్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు సినిమా నిడివి ఎక్కువని భావిస్తున్నారు.

Details

ధనుష్ కలిసి సినిమాను చూడడం గొప్ప విషయం

కానీ, కథ పరంగా ఎక్కడా తగ్గించలేని పరిస్థితి. నేను చివరి వరకూ ట్రిమ్ చేయాలనుకున్నా, కాని కథలో ఏ సీన్‌ అయినా తీసేస్తే ఫ్లో డిస్టర్బ్ అవుతుందని అనిపించిందన్నారు. ధనుష్‌తో కలిసి చెన్నైలో 'కుబేర' సినిమాను చూశానని, అది తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. అలాగే, విడుదలకు ముందు చాలా ఒత్తిడికి గురయ్యానని, కానీ ఆ తరువాత టీఫం మొత్తం ఎంతో కష్టపడి పని చేసిన ఫలితం ఎంజాయ్ చేస్తున్నామని వెల్లడించారు.