Loading...
Samantha: అలా జరగడం కూడా మంచిదే.. ఫెయిల్యూర్‌తో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: సమంత
అలా జరగడం కూడా మంచిదే.. ఫెయిల్యూర్‌తో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: సమంత

Samantha: అలా జరగడం కూడా మంచిదే.. ఫెయిల్యూర్‌తో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: సమంత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటి సమంత తన తొలి వ్యాపార ప్రయత్నం విఫలమైన అనుభవాన్ని తాజాగా పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మొదటి బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని వెల్లడించింది. అయితే ఆ వైఫల్యం తనకు విజయాల కంటే ఎక్కువ పాఠాలు నేర్పిందని తెలిపింది. వైఫల్యాలకు భయపడి కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండకూడదని అభిప్రాయపడింది. ప్రస్తుతం తాను 8 నుంచి 10 వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని, వాటిలో ఎనిమిది మహిళా వ్యవస్థాపకులు ప్రారంభించినవేనని చెప్పింది. మహిళలతో కలిసి పనిచేయడం తనకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తోందని సమంత పేర్కొంది.

ADVERTISEMENT