
Samantha : అవన్నీ తాత్కాలికమే.. రిలేషన్‌పై సమంత సెన్సేషనల్ కామెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
సమంత ఏది చెప్పినా సోషల్ మీడియాలో వైరల్ కావడం సర్వసాధారణం. సినిమాలు పెద్దగా చేయకపోయినా, ఈ మధ్య కాలంలో బాగా టూర్లు, కార్యక్రమాలు చేస్తోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుగా కొన్ని సందర్భాల్లో క్లోజ్‌గా కనిపిస్తున్నప్పటికీ, వీరిద్దరి మధ్య నిజమైన రిలేషన్ ఉన్నదా లేదా అనేది ఆమె చెప్పట్లేదు. అయితే వరుసగా ఇచ్చే ఇంటర్వ్యూల్లో సమంత తన రిలేషన్‌షిప్, వ్యక్తిగత జీవితం, హెల్త్ విషయాల్లో క్లియర్ కామెంట్లు చేస్తూ వస్తోంది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Details
ఎవరూ మనతో లేకపోయినా మనమే ముందుకెళ్లాలి
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత వ్యక్తిగతంగా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎవరూ మనతో లేకపోయినా, మనమే ముందుకు వెళ్లాలి. అప్పుడే మనం నిజంగా సక్సెస్ అవుతాము. సమాజంలో ఆడపిల్లలకు ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతాయి. ఇది చేయకు.. అది చేయు వంటి పదాలు వినిపిస్తాయి. కానీ మనం ఎంచుకున్న పని సరైనదని విశ్వసిస్తే, ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన నమ్మకం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనకు నమ్మకం ఉంచిన వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. తాత్కాలిక డ్రామాలు ఎప్పటికీ శాశ్వతం కావు.