
Pawan Kalyan: సినిమాల్లో నిజ జీవితాన్ని చూపించడం కష్టమే : పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఒకటినీ పూర్తి స్థాయిలో ఇష్టపడలేదని ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 'ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో నా మనసుకు పూర్తిగా చేరువైంది ఏదీ లేదని చెప్పాలి. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో అదే విధంగా వెండితెరపై కనిపించాలని ఉంది. కానీ అది సినిమాల్లో సాధ్యంకాకపోవచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోవచ్చని ఒక ఇంటర్వ్యూలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Details
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను
నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ, రాజకీయాలపై అవగాహనకు తన తండ్రే కారణమని పవన్ పేర్కొన్నారు. 'సినిమాల్లోకి రాకముందే నటుడిగా మారాలని నేను అనుకోలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కమ్యూనిస్టు భావజాలాన్ని పాటించేవారు. ఆయన వల్లే మాకందరికీ రాజకీయాలపై అవగాహన ఏర్పడింది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను కానీ నా ఆలోచన అంతా సమాజంపైనే ఉండేది. అదే ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఆధారపడి మంచి కథలతో ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు వచ్చేవని, కానీ ఇప్పుడు 'దంగల్' లాంటి చిత్రాలు రాకపోవడం శోచనీయమని పవన్ అన్నారు.
Details
జులై 24న హరి హర వీరమల్లు రిలీజ్
'ఆ సందర్భంలో తీసిన చిత్రాలు ఇప్పుడు రాకపోవడమే కాకుండా, ప్రేక్షకుల అభిరుచిని అందుకోలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ డైరెక్షన్‌లో 'ఓజీ' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాక, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ నటించిన 'హరి హర వీరమల్లు' రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను జులై 24న ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్రబృందం యోచిస్తోంది.