Sree Vishnu: హీరో శ్రీవిష్ణు- దర్శకుడు హసిత్ గోలి కాంబోలో సినిమా.. రేపు రివీల్ కానున్న టైటిల్
సామజవరగమన ఘన విజయం తర్వాత,యువ కథానాయకుడు శ్రీవిష్ణు మళ్లీ ఓం భీమ్ బుష్ పేరుతో మరో నవ్వుల అల్లరితో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది మార్చి 22, 2024న విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం శ్రీవిష్ణు, హాసిత్ గోలి కాంబో మరోసారి రిపీట్ కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వీరిద్దరి కాంబోలో సినిమా చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది.రేపు 11:45 AMకి, ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను రేపు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు.
టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు నామకరణం ఈవెంట్
అయితే అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదొక స్వచ్ఛమైన తెలుగు సినిమా అని చెబుతూ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు నామకరణం ఈవెంట్ అని పేరు పెట్టారు మేకర్స్. మరో సూపర్ కాంబో.. టైటిల్ ప్రకటన రేపే.. విశ్వప్రసాద్ నిర్మిత .. హసిత్ గోలి గాడి రాత, తీతలో.. మన శ్రీవిష్ణు గాడి కొత్త సినిమా నామకరణం అట.. అని పోస్టర్ పై ఉన్న వ్యాఖ్యలు ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. "వెయిట్ అప్! మీరు పక్కాగా సంతృప్తి చెందుతారు" అని పోస్టర్ లో మేకర్స్ పేర్కొన్నారు.