Jabardasth Pavithra: కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్ధస్త్ నటి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో సినిమా స్టార్స్ తో పాటు టీవీ స్టార్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
తెలుగులో విశేష ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో కామిడియన్లు వెండితెరకు పరిచయమై చక్కగా రాణిస్తున్నారు.
ఈ షో ద్వారా చాలా మంది తమ టాలెంట్‌ను నిరూపించుకొని సినిమాలో హీరోలుగా రాణిస్తున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీలో వారికంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. ఇప్పటికే యాదమ్మ రాజు లవ్ మ్యారెజ్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మరో జబర్దస్త్ నటి కూడా లవ్ మ్యారేజ్‌కి సిద్ధమైనట్లు తెలిసింది.
జబర్దస్త్ నటి పవిత్ర సంతోష్ ఓ యువకుడితో కొంతకాలం నుంచి ప్రేమలో ఉంది. తాజాగా ఆ యువకుడతో పవిత్ర పెళ్లికి ఓకే చెప్పింది.
Details
పవిత్ర పెళ్లికి కుటంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్
సంతోష్‌కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఫోటోలను పవిత్ర షేర్ చేసింది.
ఈ క్షణం కోసం ఒక సంవత్సరం నుంచి ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తున్నానని పవిత్ర చెప్పుకొచ్చింది.
తమ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించినందుకు ఆమె ధన్యవాదాలు చెప్పింది.
ఇక పోస్టు చూసిన నెటిజన్లు ఆమెకు కాంగ్రెట్స్ చెబుతున్నారు. ఇక ఈ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబుతున్నారో అనేది తెలియాల్సి ఉంది.