Jabardasth Artist: యువతిని శారీరకంగా వాడుకున్నాడని.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు
ప్రముఖ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ఆర్టిస్ట్, నవ సందీప్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనని మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోవాలని అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని బాధిత యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌పేట్‌కు చెందిన 28ఏళ్ల యువతితో నవ సందీప్ పరిచయం పెంచుకొని ప్రతి రోజూ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్న సందీప్, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను అశ్రయించింది.
సందీప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
జబర్దస్త్ ఆర్టిస్ట్ సందీప్ గోల్కొండ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిసింది. పాటలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అతడు, ఓ అమ్మాయిని మోసం చేశాడని తెలియడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి షోలతో పాపులర్ అయ్యాడు. అయితే దీనిపై సందీప్ ఇంకా స్పందించలేదు. గతంలోనూ జబర్దస్త్ ఆర్టిస్ట్ హరిపై కూడా ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే.