తదుపరి వార్తా కథనం

Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయినట్లు పోస్ట్
వ్రాసిన వారు
Stalin
Jan 07, 2024
01:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
అందరినీ నవ్విస్తూ.. మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
అవినాష్ భార్య అనూజకు అబార్షన్ అయ్యింది. దీంతో తమ బిడ్డను కోల్పోయినట్లు అవినాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
అవినాష్ 2021లో అనూజని పెళ్లాడిన విషయం తెలిసిందే. గతేడాది అనూజ గర్భం దాల్చింది.
అనూజ సీమంతం కూడా అవినాష్ ఘనంగా నిర్వహించారు. సీమంతానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాడు.
అయితే అవినాష్ త్వరలో తండ్రి అవుతాడని అందరూ అనుకున్నారు.
ఏమైందో కానీ, తాజాగా తన భార్యకు అబార్షన్ అయినట్లు అవినాష్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.
బాధలో ఉన్నామని, ప్రశ్నలను అడిగి తమను ఇబ్బంది పెట్టొద్దని అవినాష్ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా కోరాడు.