LOADING...
Jagapathi babu: 35 ఏళ్ల తర్వాత కూడా అదే ఆప్యాయత.. చిరంజీవిని ప్రశంసించిన జగపతిబాబు
35 ఏళ్ల తర్వాత కూడా అదే ఆప్యాయత.. చిరంజీవిని ప్రశంసించిన జగపతిబాబు

Jagapathi babu: 35 ఏళ్ల తర్వాత కూడా అదే ఆప్యాయత.. చిరంజీవిని ప్రశంసించిన జగపతిబాబు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 17, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ నటుడు జగపతి బాబు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక అనుభవాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. జగపతిబాబు హీరోగా పరిచయమైన తొలి చిత్రం 'సింహ స్వప్నం'. ఆ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టాలని కోరేందుకు జగపతిబాబు తన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో చిరంజీవి వరుస సినిమాలతో అత్యంత బిజీగా ఉండటమే కాకుండా, అగ్రస్థాయి స్టార్‌గా కొనసాగుతున్నప్పటికీ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించారన్నారు.

వివరాలు

35 ఏళ్ల తర్వాత కూడా అదే ఆప్యాయత..

అంతేకాకుండా, జగపతిబాబును చూసిన వెంటనే ఆయన రూపాన్ని ప్రశంసిస్తూ మంచి మాటలు చెప్పారన్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రావాలని కోరగానే ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే అంగీకరించి కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టారని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. అదే సందర్భాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు 35 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి తనను మరచిపోలేదని జగపతిబాబు చెప్పారు.

వివరాలు

ఫోన్ చేసి అభినందించిన మెగాస్టార్..

ఇటీవల 'పెద్ది' చిత్రంలో తాను పోషించిన పాత్రను చూసిన చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి అభినందించారని వెల్లడించారు. ఇంతకాలం గడిచినా ఎదుటివారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే స్వభావం చిరంజీవిలో ఉందని ఆయన ప్రశంసించారు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన జగపతిబాబు, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. విలక్షణమైన ప్రతినాయక పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

Advertisement