Page Loader
RC 16: RC 16లో అదరగొట్టిన జగ్గుభాయ్ న్యూలుక్.. వీడియో వైరల్
RC 16: RC 16లో అదరగొట్టిన జగ్గుభాయ్ న్యూలుక్.. వీడియో వైరల్

RC 16: RC 16లో అదరగొట్టిన జగ్గుభాయ్ న్యూలుక్.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

గేమ్ ఛేంజర్ సంక్రాంతి రోజు విడుదలై, విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్, తన తదుపరి చిత్రం RC 16 షూటింగ్ మొదలుపెట్టాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించబడుతున్న ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యం, గ్రామీణ క్రీడా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందించిన దర్శకుడు బుచ్చిబాబు, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

వివరాలు 

కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ 

తన పాత్రకు సంబంధించిన లుక్ మేకింగ్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన జగ్గు భాయ్, "చాలా కాలం తర్వాత బుచ్చి బాబుతో కలిసి పని చేస్తున్నాను,ఈ చిత్రంలో నా గెటప్ చూసి చాలా ఆనందంగా ఉంది" అని ట్వీట్ చేశారు. ఈ చిత్రపు మొదటి షెడ్యూల్ ఇటీవల కర్ణాటకలోని మైసూరులో పూర్తి అయింది,అక్కడ కీలక సన్నివేశాలు 15 రోజుల పాటు షూట్ చేశారు. రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు.మైత్రీ మూవీస్ బ్యానర్‌లో,సుకుమార్ రైటింగ్స్‌,వృద్ధి సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జగపతిబాబు చేసిన ట్వీట్