
Anchor Ravi : జై శ్రీరామ్.. దయచేసి ట్రోలింగ్ ఆపండి : యాంకర్ రవి
ఈ వార్తాకథనం ఏంటి
యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ షోలో చేసిన సీన్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చిరంజీవి నటించిన 'బావగారు బాగున్నారా' సినిమాలోని గుడి సన్నివేశాన్ని స్పూఫ్‌గా ప్రదర్శించినందుకు హిందూ సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
నందీశ్వరుడిని అవమానించారని ఆరోపణలతో ట్రోలింగ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో యాంకర్ రవి ఇప్పటికే ఓ వీడియోలో క్షమాపణలు చెప్పారు.
విమర్శలు కొనసాగుతుండటంతో తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.
"నేను హిందువునే. ప్రతిరోజూ దేవుళ్లకు మొక్కుతా. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుంటాను.
నా మతాన్ని నేను కించపరిచే పనులు చేయను. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు గమనించే ఉంటారు.
ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి వ్యవహారాల్లో లేను, ఇకముందు కూడా ఉండనని చెప్పారు.
Details
ఇంకా స్పందించని సుడిగాలి సుధీర్
అలాగే, "మేము చేసినది ఒక సినిమా సీన్‌ను స్పూఫ్ చేయడం మాత్రమే. కావాలని స్క్రిప్ట్ రాసుకున్నాం అన్నది అసత్యం. కొన్ని మీడియా సంస్థలు వ్యూస్ కోసం తప్పుదారి పడేలా థంబ్‌నెయిల్స్ వేస్తున్నాయి.
దయచేసి వాటిని నమ్మకండి. నేను హిందూ మతాన్ని ఎంతో ప్రేమిస్తాను. నా దేశాన్ని కూడా గౌరవిస్తాను. ఇలాంటి తప్పులు ఇకపై జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. దయచేసి ట్రోలింగ్ ఆపండి. జై శ్రీరామ్ అంటూ స్పష్టం చేశారు.
మరోవైపు సుడిగాలి సుధీర్ మాత్రం ఈ వివాదంపై ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
దీంతో ఆయనపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ సంఘాలు ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వారి చర్యలను ఖండించాయి.