LOADING...
Jailer 2: భారీ స్థాయిలో 'జైలర్ 2'.. రజినీతో జతకట్టిన మిథున్ చక్రవర్తి
భారీ స్థాయిలో 'జైలర్ 2'.. రజినీతో జతకట్టిన మిథున్ చక్రవర్తి

Jailer 2: భారీ స్థాయిలో 'జైలర్ 2'.. రజినీతో జతకట్టిన మిథున్ చక్రవర్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో స్క్రీన్‌ మీద కనిపించనున్నారు. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న 'జైలర్‌ 2' (Jailer 2) చిత్రంలో మిథున్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది. రజనీకాంత్‌తో పాటు మిథున్‌ ఈ వారం నుంచే షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారని యూనిట్‌కు దగ్గర వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మిథున్‌ పాత్ర కథనానికి మేజర్‌ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

Details

రూ.600 కోట్లకు పైగా వసూళ్లు

ఇంతకుముందు రజనీకాంత్, మిథున్‌ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. 1989లో విడుదలైన హిందీ చిత్రం 'భ్రష్టాచార్' (Bhrashtachar), 1997లో విడుదలైన బెంగాలీ చిత్రం 'భాగ్యదేవత' (Bhagya Devta)లో రజినీ చిన్న పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పుడు 'జైలర్ 2'లో మిథున్ పూర్తి స్థాయి పాత్ర చేయడం ప్రత్యేకంగా మారింది. 2023లో వచ్చిన జైలర్ (Jailer) భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో రజనీకాంత్ పోషించిన టైగర్ ముత్తువేల్‌ పాండియన్‌ పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల నుంచి అపారమైన స్పందన లభించింది.

Details

ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్లు

ఆ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ చేసిన పవర్‌ఫుల్‌ కెమియోలు సినిమాకు మరో ఆకర్షణగా నిలిచారు. రజనీకాంత్ ప్రస్తుతం నటించిన కూలీ (Coolie) బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. నాలుగు రోజుల్లోనే దేశీయంగా రూ.200 కోట్ల మార్క్‌, గ్లోబల్‌గా రూ.400 కోట్ల క్లబ్‌ను దాటేసింది.