
Rajinikanth : 'జైలర్ 2' షూటింగ్ అప్‌డేట్.. కేరళ కీలక సన్మివేశాలు చిత్రీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రం 'జైలర్ 2' చాలా ఆసక్తిని రేపుతున్నది.
2023 ఆగస్ట్ 10న విడుదలైన 'జైలర్' సినిమాకు ఇది సిక్వెల్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజినీ పాత్రను అతని వయసుకు అనుగుణంగా డిజైన్ చేసి, కథను మరింత ఆసక్తికరంగా అభివృద్ధి చేశారు.
'జైలర్' సినిమా ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ పొందడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించుకున్నది.
రజినీ పాత్ర, అతని యాక్షన్ సీక్వెన్సులు, మేనరిజమ్స్ వంటి అంశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి.
ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్ణా మీనన్, వినాయకన్ కీలక పాత్రలను పోషించారు. వారి పాత్రలను కూడా సరిగ్గా డిజైన్ చేశారు.
Details
2026 వేసవిలో విడుదలయ్యే ఛాన్స్
ఇప్పుడు, 'జైలర్ 2' కోసం నటించే రజినీ, ఇతర నటులు కేరళలోని అథపాడి ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సినిమా కోసం భారీ సెట్లు కూడా ఇప్పటికే నిర్మించనట్లు తెలుస్తోంది.
నెల్సన్, రజినీ పాత్రను పూర్తిచేయడానికి మరొక 10-20 రోజుల్లో కేరళ షెడ్యూల్ ముగించాలని నిర్ణయించారు.
ఈ సమయంలో, క్రేజీ కామెడీ సీన్స్ కూడా తెరకెక్కిస్తున్నారని, రజినీ ఫ్యామిలీ సన్నివేశాలను, తన మనవడు, రమ్యకృష్ణ లపై చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
2026లో ఈ చిత్రం వేసవిలో విడుదల అవ్వనుందని సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నాయి.