అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్
రజనీకాంత్ జైలర్ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. గత కొన్నేళ్ళలో రజనీకాంత్ నుండి రిలీజైన సినిమాలతో పోల్చితే జైలర్ కు చాలా హైప్ వచ్చింది. 2016లో రిలీజైన కబాలి తర్వాత అంతటి హైప్ జైలర్ కు వచ్చింది. ఆ హైప్ కారణంగానే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అమెరికాలో జైలర్ సినిమాకు జనం క్యూ కడుతున్నారు. దాదాపు 340లొకేషన్లలో జైలర్ విడుదల అవుతుంది. ఇప్పటికే 37,116టికెట్లు అడ్వాన్స్ గా అమ్ముడయ్యాయని సమాచారం. అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6.64కోట్ల వసూళ్ళు వచ్చాయని తెలుస్తోంది. చాలా సులభంగా అడ్వాన్స్ బుకింగ్స్ తో వన్ మిలియన్ డాలర్ మార్కును దాటుతుందని అంటున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో జైలర్ రికార్డు
ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో ఏ సినిమాకు కూడా జైలర్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో రాలేదు. ఈ లెక్కన ఆల్రెడీ రికార్డు క్రియేట్ చేసిందని అర్థం. ఒక్క అమెరికాలోనే కాదు మనదేశంలో చెన్నై, బెంగళూరు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్ వేరే లెవెల్లో ఉన్నాయని తెలుస్తోంది. చెన్నైలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3.46కోట్లు, బెంగళూరులో 4.70కోట్ల వసూళ్ళు వచ్చాయని సమాచారం. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమెరికాలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా కబాలి ఉంది. ఆ తర్వాతి స్థానంలో పొన్నియన్ సెల్వన్-1 నిలిచింది. మూడవ స్థానంలో జైలర్ నిలబడింది. జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపిస్తుంది. రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.