Varanasi: 'వారణాసి'పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. మేకింగ్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టనున్నాడా?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'. ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కేల్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు సమాచారం. 'వారణాసి' కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను మేకర్స్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ యానిమల్స్‌తో చిత్రీకరిస్తున్న క్లిష్టమైన సన్నివేశాల కోసం చిత్రబృందం చేస్తున్న కృషి కూడా ఈ మేకింగ్ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
వివరాలు
అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనలు, భారీ యాక్షన్ సన్నివేశాల రూపకల్పన, నటీనటులు, సాంకేతిక నిపుణులు పడుతున్న శ్రమ వంటి అంశాలను ఇందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకుడు గోగితా చిక్వైడ్జే పనిచేస్తున్నట్లు IMDbలోని వివరాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి.
అయితే దీనిపై 'వారణాసి' చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సినిమా నిర్మాణ ప్రక్రియను ప్రేక్షకులకు మరింత దగ్గరగా పరిచయం చేసేలా డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
'వారణాసి'పై ఇప్పటికే భారీ క్రేజ్
కేవలం సినిమా విడుదల సమయంలోనే కాకుండా.. ప్రమోషనల్ కంటెంట్‌గా లేదా మూవీ రిలీజ్ తర్వాత ప్రత్యేక ఫీచర్‌గా ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్.
ఈ సినిమా వెనుక పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషిని ప్రేక్షకులకు మరింత దగ్గరగా చూపించడమే డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
మహేశ్‌బాబు-జక్కన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో 'వారణాసి'పై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది.
ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‌పైనే ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారనే వార్త ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది.
అయితే డాక్యుమెంటరీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.