LOADING...
Jana nayagan : లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' ప్రసారం..రంగంలోకి పోలీసులు..యజమాని అరెస్ట్
లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' ప్రసారం..రంగంలోకి పోలీసులు..యజమాని అరెస్ట్

Jana nayagan : లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' ప్రసారం..రంగంలోకి పోలీసులు..యజమాని అరెస్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 14, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జననాయగన్' సినిమాకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఈ సినిమా పైరసీ కాపీ సోషల్ మీడియాలో బయటకు రావడంతో కలకలం రేగగా, ఇప్పుడు మరో ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే ఈ చిత్రాన్ని కోయంబత్తూరులోని ఒక లోకల్ ఛానల్‌లో ప్రసారం చేయడం చర్చనీయాంశమైంది.

వివరాలు

సైబర్ పోలీసుల దాడి..

ఏప్రిల్ 10న ఈ చిత్రం లీక్ అయినట్టు చిత్రబృందం గుర్తించింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న కోయంబత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్ ఛానల్స్‌లో ఈ సినిమాను ప్రసారం చేసినట్టు సమాచారం బయటపడింది. విషయం తెలుసుకున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నాయకులు వెంటనే ప్రసారాన్ని ఆపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత ఛానల్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి సినిమా మొత్తం ఇప్పటికే ప్రసారం అయిపోయిందని టీవీకే ప్రతినిధులు తెలిపారు.

వివరాలు

ఆరుగురు అరెస్ట్..

ఇక ఈ లీక్ వ్యవహారంపై విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఎడిటింగ్ విభాగం నుంచే లీక్ అయిందనే ప్రచారాన్ని ఎడిటర్స్ యూనియన్ ఖండించింది. ఈ ఘటనతో ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సినీ పరిశ్రమకు చెందిన పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement