HBD Janhvi Kapoor: 'RC 16' నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
'RC 16' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా వేగంగా ముందుకు సాగుతోంది.
గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియడిక్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీటికి అనుగుణంగా స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్లను ఎంపిక చేసి సినిమా నిర్మిస్తున్నారు.
ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, మేకర్స్ ఆమెకు సంబంధించిన ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేశారు.
వివరాలు
షూటింగ్ స్పాట్ నుంచి ఓ ప్రత్యేకమైన పోస్టర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈరోజు (మార్చి 6) తన జన్మదినాన్ని జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్ చేశారు.
"మీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది.. మీ అద్భుతమైన పాత్రను 'RC 16' స్క్రీన్‌పై అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని రాసుకొచ్చారు.
దీనికి తోడు, షూటింగ్ స్పాట్ నుంచి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ను పంచుకున్నారు.
ఇందులో జాన్వీ కపూర్ చంకలో ఓ గొర్రె పిల్లను ఎత్తుకుని, క్యూట్ లుక్‌లో కనిపించింది.
మోడరన్ టీషర్ట్ ధరించి, నవ్వుతూ కనిపించిన ఈ ఫోటో సినిమాకు సంబంధించినది కానప్పటికీ , సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బుచ్చిబాబు సానా చేసిన ట్వీట్
Wishing you a very Happy Birthday #janhvikapoor Loved working with you and I can’t wait for everyone to see your terrific character on screen🔥 #RC16 pic.twitter.com/t0bbBtWaiO
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2025
వివరాలు
'దావుడి' పాటలో ఎన్టీఆర్‌తో కలిసి మాస్ స్టెప్పులు
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురైన జాన్వీ కపూర్,'దఢక్' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. 'చుట్టమల్లే' పాటలో తన చక్కని నృత్యంతో మెప్పించగా, 'దావుడి' పాటలో ఎన్టీఆర్‌తో కలిసి మాస్ స్టెప్పులేసి అలరించింది.
'దేవర 2'లో ఆమె పాత్ర మరింత విస్తృతంగా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు.
అయితే, అంతకంటే ముందే 'RC 16' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇందులో కూడా ఆమె గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుందనే ప్రచారం సాగుతోంది.
వివరాలు
ఇప్పటికే విడుదల అయ్యిన క్యారెక్టర్ పోస్టర్స్
ఇప్పటివరకు 'జగదేక అతిలోకసుందరి' వంటి పలు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించారు.
ఇప్పుడు, 'RC 16'లో వారి పిల్లలు రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా కనిపించడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, 'మీర్జాపూర్' ఫేమ్ మున్నా భయ్యా దివ్యేందు, జగపతి బాబు వంటి కీలక నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని క్యారెక్టర్ పోస్టర్స్ విడుదలయ్యాయి. తాజా సమాచారం మేరకు శివరాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తయిందని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.
రామ్ చరణ్ జన్మదిన ప్రత్యేకంగా, ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తారని మెగా ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.