
Janhvi Kapoor: లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో జాన్వీ కపూర్ తళుకులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మకమైన 'లాక్మే ఫ్యాషన్ వీక్' 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులను ధరించి,స్టేజ్‌పై ర్యాంప్ వాక్ చేశారు.
బంధాని ఫాబ్రిక్‌తో రూపొందించిన నల్లటి గౌనులో మెరిసిపోతూ,తన హొయలతో మంత్రముగ్ధులను చేశారు.
జాన్వీ అద్భుతమైన ర్యాంప్ వాక్, ఆమె అందాలకు అందరూ ముగ్ధులయ్యారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ డిజైనర్ రాహుల్ మిశ్రా షో స్టాపర్‌గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పొడవాటి నల్లటి కోటు ధరించి స్టేజీపైకి ప్రవేశించిన ఆమె, కొంత సేపటి తర్వాత కోటును తీసేసి ఫొటోలకు అదిరిపోయే పోజులిచ్చారు.
వివరాలు
వైరల్ అయ్యిన ఫ్యాషన్ షో వీడియోలు
ఫ్రంట్ అండ్ బ్యాక్ యాంగిల్స్‌లో స్టైలిష్ స్టిల్స్ ఇచ్చి, ఫొటోగ్రాఫర్లను తన వైపుకు తిప్పుకున్నారు.
ఆమె ప్రతి అడుగుకు కెమెరాలు క్లిక్‌మనిపించాయి. అనంతరం కొంత దూరం తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించి, చివరగా మరోసారి గ్రేస్‌ఫుల్ పోజులిచ్చి స్టేజ్‌ను వీడారు.
ఈ హాట్ ఫ్యాషన్ షో వీడియోలు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 2018లో విడుదలైన 'ధడక్' చిత్రంతో సినీరంగంలో అడుగు పెట్టారు.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు.
వివరాలు
'పెద్ది' మూవీలో హీరోయిన్‌గా జాన్వీ
అయినప్పటికీ, 'జూనియర్ శ్రీదేవి'గా ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం జాన్వీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్లతో పూర్తిగా బిజీగా ఉన్నారు.
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె 'దేవర' సినిమాలో నటించి, మొదటి సినిమాతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్యాషన్ షో వీడియోలు
Damn #JanhviKapoor 🥵🔥 pic.twitter.com/yKNutIHEkf
— 𝘔𝘜𝘡𝘡 (@MushtieQ) March 29, 2025